Thursday, December 25, 2008

ఓ ప్రియా .....

ప్రియా....
తొలి చూపుతోనే నా మదిలో అలజడి రేపినావు ...
నాటి నుంచి నా మదిలో నీవే కొలువున్నావు
నిన్ను చూస్తూనే గడిపాను మరువలేని మధుర క్షణాలెన్నో ....
నిన్ను చూడకనే గడిచిన క్షణాలలో నేను మధన పడ్డాను ఎంతో .....
కవ్వించే నీ కొంటె చుపునుచుసి నా కళ్ళు అయ్యాయి కళల మయం
వికసించే నీ చిరునవ్వునుచుసి నా హృదయం అయింది నీకు దాసోహం ......
క్షణమైనా కునుకు రానీయదు నీరూపం
నీముష మైనా నిలువదు నిన్ను తలవక హృదయం
ఇక నీ తలపుతోనే నా మనస్సు ఉన్నది ....
నీ ప్రేమకోసమే నా తనవు ఉనది .......

****క్రిష్*****

చనువు

నీ చనువుకి భావం తెలియక కాదు
నా భంధాలకు భంధినని చెప్పలేకనే
రాతినై నీ ఆశకు అనకటఃనైతినే కానీ
మనసేరుకలేక కాదు విరువలేకని తేలపలేను!

Wednesday, December 24, 2008

చిట్టి మనసు

ప్రియా ......

నలుగురిలో నేను ఉన్నప్పుడు ,
హఠాత్తుగా నువ్వు గుర్తుకు వచ్చినప్పుడు ,
దిగులుతో నా మనసు బరువెక్కినప్పుడు ,
మాట్లాడ్డానికి మాటలు రానప్పుడు ,
ఏమైందని అందరూ అడిగినప్పుడు ,
ఏమి చెప్పాలో తెలియక తికమక పడ్తున్నప్పుడు,
నా అవస్థ చూసి నాకే నవ్వు వచినప్పుడు ,
ఆ నవ్వుని కూడా నీతో పంచుకోవాలిఅనిపించినప్పుడు ,
నువ్వు నా దగ్గర levani మళ్ళి gurthuku వచ్చినప్పుడు ,
బాధపడుతున్న నా చిట్టి , సున్నిత మనుస్సుని emani ooradinchanu ??????

మనసు భావం

మనసులోని భావాలెన్నో మరువలేని గాయాలెన్నో .....వీడలేని నేస్తాలెన్నో విడిపోని బంధాలెన్నో మరుపురాని పాటలెన్నోమదురమయిన క్షణాలెన్నో...... కవ్వించే కబురులెన్నో తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో ......ఆశ్చర్యపరిచే అద్భుతాలెన్నోమాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో....... ముసుగువేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో ..... మనిషి జీవితంలో మరువలేనివి ఇంకెన్నో .....
ఇదే జీవితం ..... దీనిని అనుభవించు అనుక్షణం ................